![]() |
![]() |

రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార చాప్టర్ 1'. 2022లో విడుదలై, బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'కాంతార'కు ప్రీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ మూవీ విజువల్ వండర్ లా ఉందని, ముఖ్యంగా రిషబ్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. (Kantara Chapter 1)
ట్రేడ్ లెక్కల ప్రకారం, 'కాంతార చాప్టర్ 1' చిత్రం, మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇండియాలో రూ.75 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, ఓవర్సీస్ లో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
Also Read: కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ
2022లో విడుదలైన 'కాంతార' మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.3 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఫుల్ రన్ లో రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, సర్ ప్రైజ్ చేసింది. అలాంటిది ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1'.. మొదటిరోజే రూ.85 కోట్ల గ్రాస్ రాబట్టింది. 'కాంతార' డే 1 కలెక్షన్ తో పోలిస్తే.. ఇది దాదాపు 30 రెట్లు ఎక్కువ కావడం విశేషం.
'కాంతార చాప్టర్ 1' బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఒక్క బుక్ మై షోలోనే మొదటిరోజు 1.28 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి. రెండో రోజు కూడా బుక్ మై షోలో గంటకు 70 వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ లోనూ భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుత జోరు చూస్తుంటే.. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరేలా ఉంది. మరి ఫుల్ రన్ లో ఏ స్థాయి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.
![]() |
![]() |