![]() |
![]() |

గత చిత్రం డియర్ కామ్రేడ్ ని పాన్ సౌత్ ఇండియా మూవీగా చేసిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఏకంగా ఓ పాన్ ఇండియా మూవీని టార్గెట్ చేసుకున్నారు. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ బాక్సింగ్ డ్రామాకి ఫైటర్ అనే పరిశీలనలో ఉంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించి.. కొత్త షెడ్యూల్ డిసెంబర్ రెండో వారం నుంచి మొదలు కానుందట. క్లైమాక్స్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా వేసిన ఓ అండర్ గ్రౌండ్ డాన్ హౌస్ సెట్ లో విజయ్ తదితరులపై తొలుత ఓ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట పూరి. ఆపై మరి కొన్ని సీన్స్ ని ఇక్కడే డిజైన్ చేశారట. కాగా, 2021 వేసవిలో సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న ఈ సినిమాలో అనన్యా పాండే నాయికగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |