Home  »  News  »  Jr NTR: 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న సీక్రెట్స్ తెలుసా?

Updated : Apr 13, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' (Dragon) సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'దేవర'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ చేస్తున్న ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక జిమ్ ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఈ ఫోటోలో ఎన్టీఆర్ తన కండలు తిరిగిన వీపును చూపిస్తూ పవర్ ఫుల్ బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజ్ ఇచ్చారు. ఈ ఫోటోకు ఆయన ఇచ్చిన క్యాప్షన్ "Built. Not bought." (కష్టపడి నిర్మించుకున్నది.. కొన్నది కాదు) అనేది ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ పడ్డ కఠోర శ్రమకు, క్రమశిక్షణకు ఈ బాడీ ఒక నిదర్శనం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన భుజాలు, చేతులు, బ్యాక్ మజిల్స్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఆయన ఎంతలా సిద్ధమయ్యారో అర్థమవుతోంది.

ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక సీక్రెట్స్..
ఎన్టీఆర్ ట్రైనర్ కుమార్ మన్నవ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న సీక్రెట్స్ పంచుకున్నారు. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ ఏడు వారాల వ్యవధిలో సుమారు 9.5 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. అయితే ఇది కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, శరీరంలోని కండరాలను మరింత షార్ప్‌గా, చురుగ్గా మార్చుకోవడమే లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందుకోసం ఎన్టీఆర్ తన వర్కౌట్ స్టైల్‌ను కూడా మార్చేశారు. హెవీ వెయిట్ ట్రైనింగ్ నుంచి ఫంక్షనల్ ఎక్సర్‌సైజులు, కార్డియో సెషన్ల వైపు మళ్ళారు.

డైట్ మార్చేసిన ఎన్టీఆర్
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న డైట్ కూడా చాలా విభిన్నంగా ఉంది. సాధారణంగా బాడీ బిల్డింగ్ కోసం హై-ప్రోటీన్ డైట్ తీసుకుంటారు, కానీ ఎన్టీఆర్ ఈసారి 'లో-ప్రోటీన్' డైట్‌ను ఎంచుకున్నారట. గత కొన్ని ఏళ్లుగా పెంచుకున్న కండరాలను కరిగించి, ఒక లీన్ అండ్ షార్ప్ లుక్ లో కనిపించడమే దీని ఉద్దేశ్యం అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ పలు రకాల అవతారాల్లో కనిపిస్తారని, అందులో ఈ 'బీస్ట్' లుక్ ప్రధాన ఆకర్షణ కానుందని టాక్.

'డ్రాగన్' మూవీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ఈ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ మరింత పెంచేసింది.

మొత్తానికి, ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో సునామీ లోడింగ్ అని అర్థమవుతోంది. 'డ్రాగన్' సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముంది.

https://www.instagram.com/p/DXDg7ooEV-n/






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.