Home  »  News  »  Ram Pothineni: రామ్ పోతినేని పెళ్లిపై క్లారిటీ.. సింగిల్‌గా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..!

Updated : Apr 13, 2026

  • ఇంకా బ్యాచిలర్‌గానే ఉస్తాద్ రామ్.. 
  • పెళ్లి ఎప్పుడు అంటే అసలు విషయం చెప్పేసిన ఎనర్జిటిక్ స్టార్!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి తన ఎనర్జీతో, డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న రామ్.. గతేడాది చివర్లో 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అయితే, రామ్ కి అభిమానుల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్న.. "పెళ్లి ఎప్పుడు?". తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్.. తన సింగిల్ స్టేటస్ గురించి, పెళ్లిపై వస్తున్న రూమర్ల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏకాంతం అంటేనే ఇష్టం..
తాను ఎందుకు ఇంకా సింగిల్‌గానే ఉన్నానో రామ్ రీజన్ చెప్పారు. తాను చిన్నప్పటి నుంచే ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డానని తెలిపారు. "చాలామంది ఖాళీ సమయం దొరికితే బోర్ ఫీల్ అవుతుంటారు. కానీ నేను నా ఏకాంతాన్ని (Solitude) ఎంతో ఇష్టపడతాను. నా కోసం నేను సమయాన్ని కేటాయించుకోవడంలో నాకు తెలియని ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతతే నన్ను రీఛార్జ్ చేస్తుంది" అని రామ్ వివరించారు.

నా జీవితంలోకి ఎవరైనా వస్తే..
సింగిల్‌గా ఉండటం అనేది తాను కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, అది తన సహజ వ్యక్తిత్వం అని రామ్ చెప్పారు. "నా జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం గడపడానికి నేను సిద్ధమే. కానీ ఒకవేళ ఎవరూ రాకపోయినా, నేను ఒంటరిగా ఉన్నా కూడా అంతే సంతోషంగా ఉండగలను. షూటింగ్ సమయంలో నిరంతరం వందలాది మంది మధ్య ఉంటాను కాబట్టి, పని పూర్తయ్యాక నాకు నేనుగా ఉండే ఆ కొద్ది సమయం ఎంతో విలువైనది" అని చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్ అనుభవాలు..
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు తానూ ఒంటరిగానే ఉన్నానని, ఆ సమయంలో కూడా తాను ఎక్కడా అసౌకర్యానికి లోను కాలేదని రామ్ గుర్తు చేసుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని, అందుకే పెళ్లి గురించి లేదా రిలేషన్ షిప్ గురించి తనకు ఎప్పుడూ తొందర లేదని రామ్ మాటలను బట్టి అర్థమవుతోంది.

మొత్తానికి, రామ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ప్రశాంతత కోసం సింగిల్‌గా ఉండటమే మేలు" అని ఆయన చెబుతున్న విధానం చూస్తుంటే, ఈ ఇస్మార్ట్ శంకర్ పెళ్లి పీటలు ఎక్కడానికి ఇంకాస్త సమయం పట్టేలాగే ఉందని అభిమానులు భావిస్తున్నారు.

గతంలో రామ్ - భాగ్యశ్రీ బోర్సే మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. రామ్ మాటలను బట్టి చూస్తే.. అందులోనూ వాస్తవం లేదనే అనిపిస్తోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.