![]() |
![]() |

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రీ ఎంట్రీ తర్వాత సరికొత్త ఎనర్జీ, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రాజెక్టులలో 'వడ్డీ కాసుల వాడా' ఒకటి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మధ్యతరగతి జీవితాల్లో ఈఎంఐలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందుల చుట్టూ తిరిగే కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక క్రేజీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి నటించబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మనోజ్ కనిపించనున్నారు. అప్పుల తిప్పల నుంచి బయట పడేయమని ఆ వడ్డీ కాసుల వాడిని వేడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామికి, మనోజ్ జరిగే సంభాషణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఆ శ్రీనివాసుడి పాత్రలో జయం రవి ఎలా ఉంటారో చూడాలి.
Manchu Manoj, Vaddi Kaasula Vaada, Jayam Ravi, Venkateswara Swamy
![]() |
![]() |