Home  »  News  »  కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటున్న నాగ్‌!

Updated : Jan 4, 2023

ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. నిన్నటిదాకా వరుసగా విజయాలు సాధించిన వారే ఒక్కసారిగా ప‌రాజ‌యాల బాటన పడతారు. ఇక అక్కినేని నాగార్జున విషయానికి వస్తే ఈ కింగ్ కి ఈ ఏడాది కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా సాగింది. ఏడాది ఆరంభంలో నాగచైతన్యతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం చేశారు.  ఇది సోగ్గాడే చిన్నినాయనకు సీక్వెల్‌గా రూపొంది మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఎన్నో ఆశలతో ఆయన చేసిన ది ఘోస్ట్ ఘోర పరాజయం చ‌విచూసింది. ఈయ‌న‌కు  ఈ మధ్యకాలంలో ఒక సక్సెస్ వస్తే మూడు నాలుగు ఫ్లాప్స్ వస్తున్నాయి. అందుకే కథలు విషయంలో మరింత జాగ్రత్త పడాలనుకుంటున్నాడట. 

ది ఘోస్ట్ చిత్రం త‌ర్వాత  నాగార్జున మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాల‌ని భావించారు. కానీ ఎడిట‌ర్ మోహ‌న్ కుమారుడైన   మోహ‌న్ రాజా గాడ్‌ ఫాదర్ సినిమా దర్శకులు. కానీ గాడ్ ఫాదర్ పెద్దగా ఆడక పోవడంతో నాగ్‌ దాన్ని పక్కన పెట్టాడని సమాచారం. నాగ్ ప్ర‌స్తుతం  రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య వరుసగా ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ విజ‌యాలు  అనుకుంటున్నారు.  సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, పాగల్, ధమాకా వంటి చిత్రాలకు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు.  తాజాగా ఆయ‌న  ర‌వితేజ‌, త్రినాథ‌రావు న‌క్కిన కాంబోలో వ‌చ్చిన ధ‌మాకా మూవీకి ర‌చ‌యితగా ప‌నిచేశారు. ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా అద్భుత‌మైన క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తోంది. ప్ర‌స్తుతం మాస్ కా  దాస్ విశ్వక్సేన్ అన్నీ తానై  చేస్తోన్న దాస్ కి ధ‌మ్‌కి చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కానుంది.

ఇక ధ‌మాకా  విజయంతో నాగార్జునకు మరోసారి ప్రసన్నకుమార్ బెజవాడ పై నమ్మకం మరింతగా పెరిగింది. తనకు హలో బ్రదర్, ఆవిడ మా ఆవిడ, కింగ్, సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు నవరసాలను రంగరించి మంచి  విజయాన్ని అందిస్తాడని చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలకు అవకాశం ఉండడంతో ఆ పాత్రను అల్లరి నరేష్ చేత చేయించడానికి సిద్ధపడ్డారట. ఇప్పటికే అల్లరి నరేష్‌ను క‌లిసి స్టోరీ చెప్పడం, ఆయనకు పాత్ర నచ్చడంతో ఆయన ఓకే చేశారని సమాచారం. ఇటీవ‌ల అల్ల‌రి న‌రేష్ మ‌హేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి చిత్రంలో కూడా కీల‌క పాత్ర‌ను పోషించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి మ‌రో కొత్త డైరెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తోన్న నాగార్జున కు ఇకనైనా వరుస విజయాలు వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.