Home  »  News  »  ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన టైటానిక్ హీరో.. ఆ మొత్తం ఎంతో తెలుసా!

Updated : Jul 16, 2026


ప్రపంచ సినీ ప్రేమికుల ఫెవరేట్ మూవీ టైటానిక్(Titanic).. స్వచ్ఛమైన ప్రేమకి కూడా సింబాలిక్ గా నిలిచిన టైటానిక్ ద్వారా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు  'లియోనార్డో డికాప్రియో'. ఇప్పడు సోషల్ మీడియాలో ఈ పేరు సంచలనంగా మారింది.

ఇటీవల లియోనార్డో సుమారు 15 మంది అతిదులతో  కలిసి ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సెయింట్ ట్రోపెజ్‌లోని ఒక రెస్టారెంట్‌లో రాత్రి వేళ భోజనానికి వెళ్లారు. భోజనం ముగిసిన తర్వాత వెయిటర్‌కి  50,000 యూరోలని టిప్‌గా ఇచ్చాడు. 50,000 యూరోలంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 55 లక్షల రూపాయలు.  ఒక సాధారణ వెయిటర్‌కు అంత పెద్ద మొత్తం లభించడం అంటే అతని జీవిత కాలపు సంపాదనతో సమానమని చెప్పవచ్చు. సాధారణంగా ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలలో రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత కేవలం 2 నుండి 5 యూరోలు మాత్రమే టిప్‌గా ఇవ్వడం అక్కడ ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాంటి చోట లియోనార్డో డికాప్రియో ఏకంగా 50,000 యూరోలు టిప్ ఇవ్వడం అనేది సర్వీస్ ఇండస్ట్రీలోనే అత్యంత అరుదైన మరియు భారీ మొత్తంగా రికార్డు సృష్టించింది. ఈ భారీ మొత్తాన్ని అందుకున్న ఆ వెయిటర్ ఒక్కసారిగా నమ్మలేకపోయాడు. తీవ్రమైన భావోద్వేగానికి లోనై కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.


Also read: హీరోయిన్ కి ముద్దు పెట్టబోయిన అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ గ్యారంటీ 

ఈ సంఘటన గురించి ఫ్రెంచ్ టెలివిజన్ వ్యాఖ్యాత బెంజమిన్ కాస్టాల్డి తన పాపులర్ యూరప్ 2 మార్నింగ్ షో 'కాస్టా రెవెయిల్ లా ఫ్రాన్స్' లో స్వయంగా వెల్లడించారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో బెంజమిన్ అదే రెస్టారెంట్‌లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. బెంజమిన్ తెలిపిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లియోనార్డో డికాప్రియో ఈ బిల్లు మరియు టిప్ మొత్తాన్ని చెల్లించడానికి ఎటువంటి బ్రాండింగ్ లేదా లోగోలు లేని ఒక సాదా వైట్ బ్యాంక్ కార్డును ఉపయోగించారు. సాధారణంగా బిలియనీర్లు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్లాక్ కార్డులను ఉపయోగిస్తుంటారు, కానీ ఏ రకమైన సమాచారం లేని ఈ వైట్ కార్డ్ ఆయన యొక్క అమితమైన సంపదకు మరియు నిరాడంబరతకు నిదర్శనమని బెంజమిన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 నటులలో 7వ స్థానంలో ఉన్న లియోనార్డో, ప్రస్తుతం హాలీవుడ్‌లో షాన్ పెన్ మరియు బెనిసియో డెల్ టోరోలతో కలిసి 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' వంటి 5 క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఈ మానవతా సాయంపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

leonardo dicaprio, titanic






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.