![]() |
![]() |
.webp)
తెలుగునాట అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా పేరు పొందారు దర్శకధీరుడు రాజమౌళి. అంతేకాదు.. `స్టూడెంట్ నంబర్ వన్` నుంచి `బాహుబలి - ది కంక్లూజన్` వరకు ఎన్నో సంచలన విజయాలు తన సొంతం చేసుకున్నారు జక్కన్న. త్వరలో `ఆర్ ఆర్ ఆర్`తో సందడి చేయనున్నారాయన. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ డ్రామా.. ఎట్టకేలకు వేసవి కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
Also Read: పూరి - విజయ్ చిత్రానికి రెహమాన్ బాణీలు!?
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే... సమ్మర్ సీజన్ లో జక్కన్న నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ఆయన ప్రీవియస్ మూవీ `బాహుబలి - ది కంక్లూజన్` ఒక్కటే ఇప్పటివరకు వేసవిలో సందడి చేసింది. మళ్ళీ ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్`తో అదే సీజన్ లో ఎంటర్టైన్ చేయబోతున్నారు రాజమౌళి. మరి.. `బాహుబలి - ది కంక్లూజన్` అనంతరం దాదాపు ఐదేళ్ళ తరువాత మళ్ళీ సమ్మర్ నే టార్గెట్ చేసుకుని వస్తున్న `ఆర్ ఆర్ ఆర్` కూడా ఇండియన్ బాక్సాఫీస్ ముంగిట ఆల్ టైమ్ రికార్డ్ గా నిలుస్తుందేమో చూడాలి.
Also Read: ఏడోసారి వెంకీ, మీనా జోడీ.. కొడుకుగా రానా!?
కాగా, `ఆర్ ఆర్ ఆర్`లో ఆలియా భట్, ఓలివియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన ఈ సినిమాని డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
![]() |
![]() |