![]() |
![]() |

రేపు ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)వార్ 2 (War 2)తో, రజినీకాంత్(Rajinikanth),నాగార్జున(Nagarjuna)లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)'కూలీ'(Coolie)తో థియేటర్స్ లో అడుగుపెడుతుండటంతో ఇండియా వ్యాప్తంగా సినీ ప్రియుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా అభిమానుల్లో అయితే పండుగ వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. రెండు చిత్రాలు కూడా భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ తో వస్తుండటంతో, ఆన్ లైన్ వేదికగా బుకింగ్స్ ఓపెన్ చెయ్యగానే విత్ ఇన్ సెకన్లలోనే టికెట్స్ అయిపోయాయి. దీన్ని బట్టి ఆ రెండు చిత్రాలకి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.
కూలీ రిలీజ్ సందర్భంగా తమిళనాడు(Tamilanadu)లో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకి సెలవలు ప్రకటించాయి. 'యూనో ఆక్వా కేర్'(Uno Aqua Care)అనే సంస్థ ఇంకో అడుగు ముందుకేసి తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో పాటు ఉచితంగా 'కూలీ' టికెట్స్ ని కూడా అందించింది. చెన్నై తో పాటు బెంగుళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం బ్రాంచ్‌ల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Apgovt)కూలీ మొదటి రోజు ఉదయం 5 గంటల షోకి అనుమతి ఇవ్వడంతో పాటు, సినిమా విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో ప్రస్తుతం ఉన్న రేట్స్ కి జిఎస్ టి కలుపుకొని 100 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్‌లో 75 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. వార్ 2 కి రిలీజ్ రోజు ఉదయం 5 గంటల షోకి పర్మిషన్ ఇస్తు,టికెట్ ధర 500 కి మించి ఉండకూడదని, రిలీజ్ రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో జిఎస్ టి తో ప్రస్తుతం ఉన్న రేట్స్ కి 100 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్‌లో 75 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. డైలీ ఐదు షో లకి మించి ప్రదర్శించకూడదని కూడా తన ఉత్తర్వులలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు.

![]() |
![]() |