![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంతలా మెప్పించిందో అందులోని సాంగ్స్ కూడా అంతే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల తర్వాత స్క్రీన్ పై సాంగ్స్ ని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో వీడియో సాంగ్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలైన 'నాటు నాటు', 'కొమ్మా ఉయ్యాలా', 'దోస్తీ' వీడియో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా 'ఎత్తర జెండా' సాంగ్ ఫుల్ వీడియో విడుదలైంది.
సినిమా చివరిలో వచ్చే 'ఎత్తర జెండా' సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆలియా భట్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసే స్టెప్స్ అలరిస్తాయి. అలాగే అజయ్ దేవ్ గణ్, ఒలివియా మోరిస్ కూడా ఈ సాంగ్ లో మెరుస్తారు. ఇక ఈ సాంగ్ చివరిలో రాజమౌళి సర్ ప్రైజ్ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ, కీరవాణి, సాహితి, హారిక ఈ సాంగ్ ని ఆలపించారు. తాజాగా విడుదలైన 'ఎత్తర జెండా' వీడియో సాంగ్ కి యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్' నుంచి 'కొమురం భీముడో' వీడియో సాంగ్ ని త్వరగా విడుదల చేయాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందులో సినిమాకి కీలకమైన విజువల్స్ ఉండటంతో ఈ సాంగ్ ని కాస్త ఆలస్యంగా రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. కొందరు మాత్రం సినిమా విడుదలై నెలరోజులు దాటి పోవడంతో వచ్చే వారమే ఆ సాంగ్ విడుదల కానుందని చెబుతున్నారు.
![]() |
![]() |