![]() |
![]() |

ఫ్యాన్స్ ఏ పుణ్యం చేసుకున్నారో గాని తమ అభిమాన హీరోకి చెందిన సూపర్ డూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి వాళ్ల అభిమానానికి ఒక స్థాయిని, సార్దకతని కలగచేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్న ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే కి మురారి రిలీజ్ అయ్యి అభిమానుల్లో జోష్ ని నింపడమే కాకుండా రీ రిలీజ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ ఆనవాయితీని కంటిన్యూ చెయ్యడానికి మెగా బ్రదర్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ఇద్దరు తమ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీస్ ని అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిరు బర్త్ డే అగస్ట్ 22 . అభిమానులకి మాత్రం పండుగ రోజు. ఈ సందర్భంగా వాళ్లల్లో మరింత పండగ వాతావరణాన్ని తెచ్చేలా ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇంద్ర మేకర్స్ వైజయంతి మూవీస్ నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. వైజయంతి బ్యానర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుండంతో నిర్మాత అశ్వని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రీ రిలీజ్ చేస్తున్నారు. జులై 24 2002 లో వచ్చిన ఇంద్ర అప్పట్లో అనేక ఇండస్ట్రీ రికార్డులని సాధించింది. చిరు స్టెప్ లకి, పెర్ఫార్మెన్సు కి ఆల్ థియేటర్స్ విజిల్స్ తో మోత మోగిపోయాయి. సాంగ్స్ అండ్ కామెడీ కూడా సూపర్ హిట్.

ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2 . బర్త్ డే వేడుకల్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చెయ్యడానికి అభిమానులు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. పైగా పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటుగా మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో ఒక రేంజ్ లోనే జరగబోతున్నాయి. ఇక గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఒక రెగ్యులర్ సినిమా స్థాయిలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ మేరకు అధికారంగా ప్రకటన కూడా వచ్చింది. పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ 2012 మే 11 న విడుదలై ఎండాకాలం అనేది ఒకటి ఉందనే విషయాన్ని మర్చిపోయేలా చేసింది. అనేక చోట్ల ఇండస్ట్రీ రికార్డు లు నెలకొల్పింది. అంతే కాకుండా పవన్ ని ప్లాపుల సంకెళ్ళ నుంచి విముక్తిని కూడా కల్పించింది.ఇందులోని పవన్ చెప్పిన డైలాగ్స్ నేటికీ అమరత్వంతోనే ఉన్నాయి. పైగా ఇంద్ర, గబ్బరి సింగ్ లకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే డల్ గా సాగుతున్న చిరు, పవన్ కెరీర్ కి మంచి ఊపు ని ఇచ్చాయి. ఇక ఈ రెండు సినిమాల రీ రిలీజ్ విషయం సోషల్ మీడియాలో వస్తుండటంతో మహేష్ మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తారా చెయ్యరా అనే చర్చ నడుస్తుంది.
![]() |
![]() |