![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర' (Devara)పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఫియర్ సాంగ్ మాస్ ని మెప్పిస్తే, చుట్టమల్లే సాంగ్ క్లాస్ ని మెప్పించింది. నెక్స్ట్ రాబోతున్న సాంగ్స్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. (Devara Songs)
దేవర నుంచి రాబోయే నెక్స్ట్ సాంగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేస్తున్న కామెంట్స్.. సాంగ్స్ పై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్తున్నాయి. ఆయుధపూజ సాంగ్ అంతకుమించి అనేలా ఉంటుందని, ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేద్దామని రామజోగయ్య శాస్త్రి అన్నారు. అలాగే "ఆయుధపూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అవుతుంటే పక్కనుండి మా శివ గారు(కొరటాల శివ) డాన్స్ డ్యూయెట్ అయితే వేరే స్థాయి పూనకాలే అన్నారు" అని చెప్పుకొచ్చారు. అంటే దేవర నుంచి నెక్స్ట్ ఆయుధపూజ సాంగ్ తో పాటు, అదిరిపోయే డాన్స్ డ్యూయెట్ రాబోతున్నాయని అర్థమవుతోంది. ఆయుధపూజ సాంగ్ గురించి మొదటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్ లో చెప్తున్నారు. ఇక డాన్స్ డ్యూయెట్ అంటే ఎన్టీఆర్ ఏ స్థాయిలో స్టెప్పులేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి ఈ రెండు సాంగ్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అని చెప్పవచ్చు.
![]() |
![]() |