![]() |
![]() |

గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేసిన 'సీటీమార్' సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానున్నది. తమన్నా, దిగంగన సూర్యవంశీ నాయికలుగా నటించిన ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మంగళవారం సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్ డ్రామా అయిన 'సీటీమార్'లో గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటించారు. ఆ ఇద్దరూ జంటగా నటించడం ఇదే తొలిసారి. భూమిక ఓ కీలక పాత్ర చేయగా, తరుణ్ అరోరా విలన్‌గా కనిపించనున్నారు.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి, రీసెంట్‌గా విడుదలైన "జ్వాలా రెడ్డి" సాంగ్, అప్సరా రాణి చేసిన స్పెషల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపీచంద్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తయారైన 'సీటీమార్'కు మణిశర్మ మ్యూజిక్, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయని నిర్మాత చెప్పారు. "ఇక డైరెక్టర్ సంపత్ నంది టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి ప్రతి సీన్ గ్రాండియర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించేలా ఆయన సినిమాను డైరెక్ట్ చేశారు." అని ఆయన అన్నారు.
పోసాని కృష్ణమురళి, రావు రమేశ్, రెహమాన్ కీలక పాత్రధారులైన 'సీటీమార్'కు డైరెక్టర్ సంపత్ నంది స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను స్వయంగా సమకూర్చారు.

![]() |
![]() |