![]() |
![]() |

హమ్మయ్య ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan) అభిమానుల కోరిక నెరవేరబోతోంది. వాళ్ళు ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నారో ఏమో గాని రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకి వాళ్ళ ఆశ ఫలించబోతుంది. దీంతో ఇప్పుడు మెగా అభిమానుల సందడి మొదలయ్యింది. సోషల్ మీడియాలోను రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటో చూద్దాం.
చరణ్ ప్రెస్టేజియస్ట్ మూవీ గేమ్ చేంజర్ (game changer) రేపు ఈ మూవీ నుంచి జరగండి అనే సాంగ్ రిలీజ్ కాబోతుంది. చరణ్ పుట్టిన రోజు కానుకగా ఉదయం తొమ్మిది గంటలకి డైరెక్ట్ గా యూట్యూబ్ లో విడుదల కానుంది. దీంతో మెగా అభిమానుల్లో పండగ వాతావరణం వచ్చినట్టయింది.పైగా చరణ్ బర్త్ డే కూడా కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. సినీ అభిమానుల్లో కూడా ఈ వార్త ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ లో వస్తున్న ఆ సాంగ్ వినాలని అందరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

నిజానికి 2021 లోనే గేమ్ చేంజర్ స్టార్ట్ అయ్యింది. ఆది నుంచి ఎన్నో అవాంతరాలు వచ్చి షూటింగ్ పోస్ట్ పోన్ అవుతు వచ్చింది. రేపు రిలీజ్ అయ్యే జరగండి సాంగ్ కూడా ఇంతకు ముందు రిలీజ్ అని అనౌన్స్ వచ్చింది.కానీ టెక్నీకల్ రీజన్ వలన ఆగిపోయింది. ఇండియన్ బిగెస్ట్ డైరెక్టర్ శంకర్ (shankar) దర్శకత్వంలో దిల్ రాజు (dil raju) అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. చరణ్ సరసన కియారా అద్వానీ జోడి కట్టగా అంజలి మరో కధానాయికగా చేస్తుంది. దక్షిణ సినీ పరిశ్రమకి చెందిన టాప్ స్టార్ అందరు ఇందులో నటిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి గేమ్ చేంజర్ హంగామా స్టార్ట్ అవ్వబోతుందని చెప్పవచ్చు.
![]() |
![]() |