![]() |
![]() |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)డ్యూయల్ రోల్ పోషించిన 'గేమ్ చేంజర్'(Game Changer)సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ గా,ప్రజలకి మంచి చెయ్యాలనే ఆశయంతో డబ్బుల్లేని రాజకీయాలు చెయ్యాలని, రాజకీయ పార్టీని స్థాపించే 'అప్పన్న' క్యారెక్టర్స్ లో చరణ్ సూపర్ గా చేసాడు.కానీ ప్రెజెంటేషన్ లోని లోపాల వల్ల మూవీ ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.
గేమ్ చేంజర్ ఓటిటి హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.రిలీజ్ టైంలో టైటిల్స్ లోనే ఈ విషయాన్నీ వెల్లడి చేసారు.కానీ ఓటిటి రిలీజ్ డేట్ మీద ఇంకా ఎలాంటి
అధికార ప్రకటన అయితే రాలేదు.ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 న రిలీజ్ అవుతుందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.తెలుగుతో పాటు ఇతర భాషల్లోను సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తారనే మాటలు కూడా వినపడుతున్నాయి.150 కోట్ల భారీ మొత్తానికి అమెజాన్ దక్కించుకుందనే టాక్ కూడా ఉంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju)నిర్మించిన 'గేమ్ చేంజర్' కి శంకర్(Shankar)దర్శకుడు కాగా కియారా అద్వానీ(Kiara adwani)అంజలి(Anjali)హీరోయిన్లు గా చేసారు.థమన్(Thaman)సంగీతాన్ని అందించగా ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందించాడు.
![]() |
![]() |