![]() |
![]() |

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ నయనతార మధ్య కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో నయనతారకు బిగ్ షాక్ తగిలింది. (Nayanthara VS Dhanush)
2022లో నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ ప్రయాణాన్ని, పెళ్లి వేడుకని డాక్యుమెంటరీలా చేసి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ ధాన్' (నేనూ రౌడీ నే) సినిమాకి సంబంధించిన కొన్ని సెకన్ల క్లిప్ ని ఉపయోగించారు. ఈ సినిమాను ధనుష్ నిర్మించాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, నయనతార హీరోయిన్ గా నటించింది. దీంతో తమ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కావడంతో.. తమ ప్రేమకు గుర్తుగా 'నానుమ్ రౌడీ ధాన్' క్లిప్ ను డాక్యుమెంటరీలో ఉపయోగించారు. కానీ తన అనుమతి లేకుండా ఆ క్లిప్ యూజ్ చేయడంతో ప్రొడ్యూసర్ గా ధనుష్ లీగల్ నోటీసులు పంపాడు. ఆ క్లిప్ వాడుకున్నందుకు రూ.10 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాడు.
అయితే దీనిపై నయనతార తీవ్ర విమర్శలు గుప్పించింది. కానీ ఆ సమయంలో నయన్ కంటే ధనుష్ కే ఎక్కువ మద్దతు లభించింది. మీ పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ కి భారీ మొత్తంలో అమ్ముకున్నప్పుడు.. ధనుష్ లీగల్ నోటీసులు పంపడంలో తప్పేముందని పలువురు అభిప్రాయపడ్డారు. పైగా 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా టైంలోనే నయన్-ధనుష్ మధ్య విబేధాలు నెలకొన్నాయనే ప్రచారం ఉంది. అలాంటప్పుడు తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా క్లిప్ ని ధనుష్ ఫ్రీగా ఎందుకివ్వాలి అనే కామెంట్స్ కూడా వినిపించాయి. తాజాగా కోర్టులో సైతం నయనతారకి ఇటువంటి షాకే తగిలింది.
కొన్ని సెకన్ల క్లిప్ కి రూ.10 కోట్లు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, నెట్ ఫ్లిక్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కాపీ రైట్ యాక్ట్ ప్రకారం ధనుష్ కి ఆ హక్కు ఉందని అభిప్రాయపడింది. దీంతో నయన్ కి షాక్ తగినట్లయింది. మరి నయనతార మరియు నెట్ ఫ్లిక్స్ సంస్థ.. ధనుష్ డిమాండ్ చేసినట్లుగా డబ్బు చెల్లిస్తారేమో చూడాలి.
![]() |
![]() |