![]() |
![]() |

కొంతకాలంగా వరుస సినిమాలతో నిరాశపరుస్తున్న విజయ్ దేవరకొండ.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సాంకృత్యాన్, రవికిరణ్ కోలా వంటి ప్రతిభగల దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నాడు. వీటిలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విజయ్ కెరీర్ లో 14వ సినిమాగా రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ, భారీ బడ్జెట్ తో విజయ్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. (VD14)
గతంలో విజయ్, రాహుల్ కాంబినేషన్ లో 'టాక్సీవాలా' అనే హిట్ మూవీ వచ్చింది. ఆ తర్వాత నాని హీరోగా 'శ్యామ్ సింగరాయ్' అనే చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్న రాహుల్.. ఇప్పుడు విజయ్ కోసం మరో వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1850 సమయంలో జరిగే కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో, ఇప్పటివరకూ ఎవరు టచ్ చేయని కథాంశంతో, ఎంతో పవర్ ఫుల్ గా ఈ సినిమా ఉంటుందని ఇటీవల దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెలిపాడు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే 'VD14'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారట.

80 ఏళ్ళ వయసులోనూ అమితాబ్.. బిగ్ స్క్రీన్ పై అదరగొడుతున్నారు. తెలుగులో చివరగా ప్రభాస్ తో కలిసి 'కల్కి' మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అశ్వత్థామగా అమితాబ్ తనదైన నటన, స్క్రీన్ ప్రజెన్స్ తో కట్టిపడేశారు. అలాగే ఆ సినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ అలరించడం విశేషం. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి 'VD14'లో నటించబోతున్నారని తెలుస్తోంది. 'VD14'లో కథకి అత్యంత కీలకమైన పవర్ ఫుల్ పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్రకు అమితాబ్ అయితే బాగుంటారనే ఉద్దేశంతో.. చిత్ర బృందం ఆయనను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అమితాబ్ ఈ తరం స్టార్స్ తో పోటీ పడి నటించడమే కాకుండా.. కొన్నిసార్లు స్క్రీన్ పై ఇప్పటి స్టార్స్ ని కూడా డామినేట్ చేసేస్తున్నారు. అలాంటి అమితాబ్ తో పోటీపడి నటించి, విజయ్ తన మార్క్ చాటుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |