![]() |
![]() |

'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన చిత్రం 'గం గం గణేశా' (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో రూపొందిన ఈ క్రైమ్ కామెడీ ఫిల్మ్ మే 31న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. ముఖ్యంగా కామెడీ సీన్స్ ఆడియన్స్ ని మెప్పించాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ మూడు వారాలు కూడా కాకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
'గం గం గణేశా' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈరోజు(జూన్ 20) నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక, ప్రగతి శ్రీవాత్సవ, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన 'గం గం గణేశా' చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా ఆదిత్య జవ్వాది, ఎడిటర్ గా కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరించారు.
![]() |
![]() |