![]() |
![]() |

ఇప్పుడు ప్రభాస్ (prabhas)ఫ్యాన్స్ ఎవరో ప్రేక్షకులెవరో తెలియని పరిస్థితి. ఎందుకంటే అందరు ఎంతో ఉత్సాహంగా జూన్ 27 న రిలీజ్ కాబోయే కల్కి 2898 ఏడి కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటి దాకా ట్రైలర్ చూస్తు మూవీ ఎలా ఉండబోతుందో అని ఉహించుకుంటున్నారు. పైగా ఆ ఊహలని రెట్టింపు చేసేలా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అందులో ప్రభాస్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ముంబై వేదికగా జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్(amitabh bachchan)కమల్ హాసన్(kamal haasan) దీపికా పదుకునే(deepika padukone)తో పాటు కల్కి టీం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది.రానా(rana) దగ్గుబాటి వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హోస్ట్ గా వ్యవహరించాడు.ఈ సందర్భంగా ప్రభాస్ తో సినిమా గురించి ఎక్స్ పీరియన్స్ ని అడిగాడు. దాంతో ప్రభాస్ మాట్లాడుతు గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారికి, నాగీ గారికి థాంక్స్.ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీమ్. అమితాబ్ గారు దేశం మొత్తం మీద రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. ఇక కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అదే విధంగా ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్. దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. ఆమెతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్స్ అని చెప్పాడు
కమల్ హాసన్ గురించి ప్రభాస్ చెప్పిన క్లాత్ మ్యాటర్ విని చాలా మంది యూ ట్యూబ్ లో ఇంద్రుడు చంద్రుడు చూస్తున్నారు. ఫ్యాన్స్ అయితే కమల్ లా ప్రభాస్ చిన్నప్పుడు ఎలా నడిచివుండేవాడని అనుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఆ విధంగా నడుస్తున్నారు. ఇంద్రుడు చంద్రుడు లో కమల్ డ్యూయల్ రోల్. ఒక క్యారక్టర్ పేరు మేయర్ రాయుడు. ఈ క్యారక్టర్ కే భారీ పొట్ట ఉంటుంది.సింపుల్ గా చెప్పాలంటే గర్భవతి గా ఉండే ఆడవాళ్లు ఎలా అయితే నడుస్తారో ఆ విధంగా నడుస్తాడు.
![]() |
![]() |