![]() |
![]() |

బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు సందడి చేసి చాలా రోజులైంది. జూన్ 27న బిగ్గెస్ట్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' విడుదల కానుంది. దాంతో ఈ వారం కూడా చిన్న సినిమాలదే హవా. ఈ వారం అర డజను సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో 'నింద' (Nindha) ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. అప్పట్లో 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' వంటి సినిమాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా కనిపించిన వరుణ్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనకబడిపోయాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు 'నింద' అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్ 21న విడుదలవుతున్న ఈ చిత్రం.. వరుణ్ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.
జూన్ 21న 'నింద'తో పాటు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన OMG (ఓ మంచి ఘోస్ట్), చైతన్యరావు-హెబ్బా పటేల్ జంటగా నటించిన 'హనీమూన్ ఎక్స్ ప్రెస్', 'ప్రభుత్వ జూనియర్ కళాశాల', 'సీతా కళ్యాణ వైభోగమే' సినిమాలు విడుదల కానున్నాయి. జూన్ 22న 'సందేహం' థియేటర్లలో అడుగు పెట్టనుంది.
ఈ వారం ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్ లు అలరించనున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
గం గం గణేశా మూవీ - జూన్ 20
నెట్ ఫ్లిక్స్ :
కోటా ఫ్యాక్టరీ సిరీస్ సీజన్ 3 - జూన్ 20
నడిగర్ మూవీ (మలయాళం) - జూన్ 21
డిస్నీ + హాట్ స్టార్:
బాక్ మూవీ (తెలుగు వెర్షన్)- జూన్ 21
బ్యాడ్ కాప్ సిరీస్ (హిందీ) - జూన్ 21
![]() |
![]() |