Home  »  News  »  Gaayapadda Simham Trailer: ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్.. అన్‌లిమిటెడ్ ఫన్!

Updated : Apr 26, 2026

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ 'గాయపడ సింహం'(Gaayapadda Simham)తో అలరించబోతున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ కథ ఒక యువకుడి జీవితంలో జరిగే అనుకోని మలుపు చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలుకనే తను, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా డిపోర్ట్ అవుతాడు. అతని కలలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతాయి. ప్రేమ, భవిష్యత్తు.. ఒక్కసారిగా దెబ్బతినడంతో, తనలో పెరిగే నిరాశ, కోపం అతడిని ఒక విచిత్రమైన రివెంజ్ వైపు నడిపిస్తుంది. ఈ భావోద్వేగ ప్రయాణాన్ని దర్శకుడు సెటైర్, డార్క్ హ్యూమర్‌తో మేళవించి ఆసక్తికరంగా తెరకెక్కించారు.  

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ గ్లోబల్‌ సమస్యను యువతకు కనెక్ట్ అయ్యేలా కథగా మలిచారు. సూర్య ప్రకాశ్ జ్యోసుల అందించిన కథలో భావోద్వేగం, వ్యంగ్యం, హాస్యం అన్నీ సమతుల్యంగా కనిపిస్తున్నాయి. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది.

తరుణ్ భాస్కర్ ఒక సాధారణ యువకుడిగా, ఆశలు-నిజాల మధ్య ఇరుక్కుపోయిన పాత్రను సహజంగా పోషించారు. ఆయన నటనలో భావోద్వేగం, నిరాశ, సరదా.. అన్నీ నేచురల్ గా కనిపిస్తున్నాయి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తూ కథకు మరింత అందాన్ని జోడించారు. విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సహాయ నటులు తమ పాత్రలతో సినిమాకు బలం చేకూర్చారు. జేడీ చక్రవర్తి నెగటివ్ షేడ్‌లో కనిపిస్తూ ఇంటెన్స్ ను పెంచగా, శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలుస్తుంది.

టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా ఉంది. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీకి మోడరన్, కలర్‌ఫుల్ టచ్ ఇవ్వగా, స్వీకర్ అగస్తి సంగీతం కథకు ఎనర్జీని జోడించింది. విప్లవ్ ఎడిటింగ్ సినిమా పేస్ ను కట్టుదిట్టంగా ఉంచగా, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్ విజువల్ రిచ్‌నెస్‌ను పెంచింది.

మొత్తానికి, ఇప్పటికే మంచి బజ్ ఉన్న ఈ చిత్రానికి ట్రైలర్ మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ సమ్మర్‌లో న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ గా  ‘గాయపడ్డ సింహం’ ప్రేక్షకులని అలరించబోతుంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.