![]() |
![]() |

యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ( vijay devarakonda) ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తక్కువ చిత్రాలతోనే ఎక్కువ క్రేజ్ ని సంపాదించిన హీరోల జాబితాలో కూడా చోటు సంపాదించాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి భారీ హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ (Family star) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఈ నెల 28 న విడుదల కాబోతుంది. ఇందుకు సంబంధించి ట్రైలర్ ని భారీ ఎత్తున విడుదల చెయ్యబోతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ఉదయం 11 గంటలకు తిరుపతిలోని పీజిఆర్ సినిమాస్ లో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా కూడా ప్రకటించారు. సో ఇక రేపట్నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ స్టార్ హంగామా స్టార్ట్ అవ్వబోతుందని చెప్పవచు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.మరి వాటి సరసన ట్రైలర్ నిలబడుతుందో లేదో చూడాలి. ఇక హైదరాబాద్, తిరుపతి నే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ కొంత మందిలో మొదలయ్యింది.

లైగర్, ఖుషి వరుసగా పరాజయం చెందటంతో విజయ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ మీదనే ఉన్నాయి. విజయ్ కి కూడా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విజయం చాలా అవసరం. లేటెస్ట్ సంచలనం మృణాల్ ఠాకూర్ (mrunal thakur) హీరోయిన్ గా చేస్తుంది. వీళ్లిద్దరి ఫెయిర్ కి మంచి పేరు కూడా వస్తుంది. తొలిప్రేమ వాసుకి, అజయ్ ఘోష్, రోహిణి హట్టంగడి, దివ్యంశ కౌశిక్, అభినయ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా పరశురామ్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది.
![]() |
![]() |