![]() |
![]() |

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు(Telangana phone tapping case) సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో కొందరు పోలీస్ అధికారులు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో కొందరు అరెస్ట్ కాగా, మరికొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే మొదట అప్పటి విపక్షనేతల ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని అందరూ భావించారు. కానీ రోజురోజుకి ఈ కేసుకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందరో సినీ ప్రముఖుల మరియు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి.. వారి వ్యక్తిగత విషయాలు సేకరించి.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అన్నింటికీ మించి మరో షాకింగ్ విషయం ఏంటంటే.. సమంత(Samantha), నాగ చైతన్య(Naga Chaitanya) విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది.
2017లో నాగ చైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు వారి జంటను చూసి అందరూ మురిసిపోయేవారు. తక్కువ సమయంలోనే బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకటిగా వీరి జంట పేరు తెచ్చుకుంది. యువత అయితే.. తాము కూడా చైతన్య-సమంత పెయిర్ లా ఉండాలని కలలు కనేవారు. అంత అందమైన జంటగా పేరు తెచ్చుకున్న చైతన్య-సమంత.. అనూహ్యంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని, తక్కువ టైంలోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వారు.. నాలుగేళ్లకే విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా వారు విడిపోవడానికి అసలు కారణం ఏంటో కూడా ఇప్పటివరకు బయటకు తెలియలేదు. వారు విడిపోవడమే బాధ కలిగించే విషయం అంటే.. వారు ఎందుకు విడిపోయారో తెలియకపోవడం అభిమానులకు మరింత బాధ కలిగించింది. అయితే ఇప్పుడు వారి విడాకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణమనే వార్త సంచలనం సృష్టిస్తోంది.
అప్పుడు ఫోన్ ట్యాప్ అయిన సెలబ్రిటీల లిస్టులో సమంత కూడా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమంత ఫోన్ ని ట్యాప్ చేసి, ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించి, బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే సమంత, చైతన్య మధ్య చిచ్చు పెట్టిందని న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే ఈ న్యూస్ చూసి సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఓ వైపు విడాకులు, మరోవైపు అనారోగ్య సమస్యలతో సమంత ఎంతో మానసిక క్షోభ అనుభవించింది. ఒకవేళ ఆమె క్షోభకు ఫోన్ టైపింగ్ వ్యవహారమే కారణమైతే వారిని కఠినంగా శిక్షించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడమే తప్పంటే, బ్లాక్ మెయిల్ చేయడం ఇంకా పెద్ద తప్పని.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని కోరుతున్నారు.
మరికొందరైతే అప్పట్లో సమంత ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2022లో ఒకసారి సమంత ఇన్‌స్టాగ్రామ్ నుంచి కేటీఆర్ ఫొటో పోస్ట్ అయింది. ఆ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగిందని సమంత టీం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత.. అది హ్యాకింగ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ఫోన్ ని ట్యాప్ చేయడంతో పాటు, ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా హ్యాక్ చేసుంటారు అనే డౌట్స్ వస్తున్నాయి. అనారోగ్యం దృష్ట్యా సమంతకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, దీనికి కారణమైన వారిని శిక్షించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-చైతన్య విడిపోయారా అనే దానిపై ఇప్పుడే ఒక స్పష్టతకు రాలేము. సమంత లేదా చైతన్య స్పందించేవరకు ఇవన్నీ ఊహాగానాలకే పరిమితం. అప్పటివరకు ఓ అందమైన జంట విడిపోయిందని జాలి పడటం తప్ప.. ఏం చేయలేం.
![]() |
![]() |