![]() |
![]() |

`దీపం ఉండగనే ఇల్లు చక్కదిద్దుకోవాలి` అన్నది పెద్దల మాట. `క్రేజ్ ఉన్నపుడే భారీ పారితోషికం డిమాండ్ చేయాలి` అన్నది సినీ తారల బాట. ఈ బాటలోనే వెళుతున్న నటీమణుల్లో `బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఒకరు. ఐరెన్ లెగ్ టు గోల్డెన్ లెగ్ గా టర్న్ అయిన ఈ `డీజే` బ్యూటీ.. గత కొంతకాలంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. అందుకు తగ్గట్టే.. తన రెమ్యూనరేషన్ ని భలేగా హైక్ చేసేస్తూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిపోతోంది. ఇంకా చెప్పాలంటే.. `పుష్ప`లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే `తగ్గేదేలే` డైలాగ్ ని.. పారితోషికం విషయంలో భలేగా అప్లయ్ చేస్తోంది ఈ సోయగాల ఖజానా.
తాజాగా ఓ మీడియం బడ్జెట్ మూవీకి ఏకంగా రూ.3.5 కోట్ల మొత్తాన్ని డిమాండ్ చేసిందట పూజ. అయితే, ప్రస్తుతం పూజకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ కూడా సిద్ధమయ్యారట. దీంతో.. ఆ సినిమాకి సంతోషంగా సంతకం చేసేసిందట మిస్ హెగ్డే. ఇంతకీ ఏ సినిమా కోసం పూజా హెగ్డే ఇంత మొత్తాన్ని డిమాండ్ చేసిందంటే.. యూత్ స్టార్ నితిన్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించనున్న చిత్రం కోసమట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో పూజకి, మేకర్స్ కే ఎరుక.
![]() |
![]() |