![]() |
![]() |

షాక్, మిరపకాయ్ తర్వాత మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అలాగే సంక్రాంతికి విడుదల కానున్న రవితేజ నటిస్తున్న ఈగల్ కూడా పీపుల్ మీడియా బ్యానర్ లో రూపొందుతుండటం విశేషం. ఇప్పుడు మాస్ రాజాతో మరో సినిమాని నిర్మించడానికి సిద్ధమైంది ఆ సంస్థ.
రవితేజ, హరీష్ శంకర్ కలయికలో రానున్న మూడో సినిమాని మేకర్స్ బుధవారం నాడు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. హరీష్ శంకర్ తన హీరోలను మ్యాసియస్ట్ అవతార్ లో చూపించడంలో దిట్ట. రవితేజతో హరీష్ చేసిన గత చిత్రం ’మిరపకాయ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా ఎలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందో తెలియజేయడానికి ..‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని మేకర్స్ అనౌన్స్ చేశారు.
హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కోసం హరీష్ శంకర్ ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
![]() |
![]() |