![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పటిదాకా 28 సినిమాల్లో హీరోగా నటించగా, దాదాపు అన్ని సినిమాల్లోనూ క్లీన్ షేవ్ తోనే కనిపించాడు. మహేష్ ని మీసకట్టు, గడ్డం లుక్ లో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరనుంది.
మహేష్ తన నెక్స్ట్ మూవీని ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని.. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ ని రాజమౌళి సరికొత్తగా చూపించబోతున్నాడు. పొడవాటి జుట్టు, మీసకట్టు, గుబురు గడ్డంతో మహేష్ లుక్ అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు. దానికి టీజర్ అన్నట్టుగా తాజాగా మహేష్ న్యూ లుక్ లో దర్శనమించాడు.
బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్ళిన మహేష్.. తిరుగు ప్రయాణంలో ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు. పోనీటెయిల్, గుబురు గడ్డంతో మహేష్ లుక్ సర్ ప్రైజింగ్ గా ఉంది. ఈ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాజమౌళి పుణ్యమా అని సరికొత్త లుక్ లో మహేష్ ని చూడబోతున్నామని సంబరపడుతున్నారు.
![]() |
![]() |