![]() |
![]() |
.webp)
'ఆయ్' (Aay) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun) గెస్ట్ లుగా రాబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఎన్టీఆర్, బన్నీ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఒకరినొకరు బావ అని పిలుచుకుంటూ ఉంటారు. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ ఒకే వేదికపై కనిపిస్తారని తెలిసి అభిమానులు ఎంతో సంబరపడ్డారు. అయితే ఇప్పుడు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.
'ఆయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో దసపల్లా హోటల్ లో రేపు(ఆగష్టు 12) సాయంత్రం జరగనుంది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ ఈవెంట్ కి తారక్, బన్నీ రావడంలేదట. నాగ చైతన్య గెస్ట్ గా రానున్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా తారక్, బన్నీ తమ సపోర్ట్ ని తెలియజేయనున్నారని సమాచారం.
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆయ్'. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.
![]() |
![]() |