![]() |
![]() |

తెలుగు సినిమా నటుడు అనే స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగిన తీరు ఆయన ఫ్యాన్స్ కే కాకుండా తెలుగు వారందరికి చాలా గర్వ కారణం.నేడు ప్రభాస్ సినిమా అంటే ఇండియన్ సినిమా. లేటెస్ట్ గా సలార్ తో ఘన విజయాన్ని అందుకున్న ప్రభాస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి.
సలార్ విజయాన్ని పురస్కరించుకొని తాజాగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ ని జరుపుకుంది. ఇందులో భాగంగా చిత్ర హీరోయిన్ శృతి హాసన్ యాంకర్ అవతారం ఎత్తి ప్రభాస్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మీద ప్రభాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. నా 21 ఏళ్ళ సినిమా జీవితంలో నేను కంఫర్ట్ గా ఫీల్ అయిన ఏకైక దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పాడు. ఇంతకుముందు వినాయక్ గారు నేను కంఫర్ట్ గా ఫీల్ అయ్యే దర్శకుల్లో ముందు వరుసలో ఉండే వారు ఇప్పుడు ఆ ప్లేస్ లో ప్రశాంత్ చేరాడని ప్రశాంత్ చెప్పడం ప్రాధాన్యత ని సంతరించుకుంది. అలాగే ప్రశాంత్ నీల్ దృష్టిలో నటులు అంటే దేవుళ్లతో సమానమని పైగా షూటింగ్ అయిన తర్వాత కూడా ప్రశాంత్ ని కలవాలనిపిస్తుందని ప్రభాస్ చెప్పాడు.
ప్రభాస్ చెప్పిన ఈ వ్యాఖ్యల తాలూకు ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూ లో ప్రభాస్ తో పాటు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నాడు. కాగా సలార్ ఇప్పటికి 600 కోట్ల పైన కలెక్షన్స్ ని సాధించి తెలుగు సినిమా సత్తాని విశ్వవ్యాప్తం చేసింది.
![]() |
![]() |