![]() |
![]() |

'భానుమతి... ఒక్కటే పీస్! రెండు కులాలు, రెండు మతాలు... హైబ్రీడ్ పిల్ల!!' - 'ఫిదా'లో ఒక్క డైలాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను గుండెల్లో గూడు కట్టుకున్న అమ్మాయి సాయి పల్లవి. 'ఫిదా' తరవాత తెలుగులో ఆమె నటించిన సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. అందులో నాని హీరో. ఇప్పుడు మరోసారి నాని, సాయి పల్లవి జోడీని రిపీట్ చేయడానికి దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ప్రయత్నిస్తున్నారు.
'టాక్సీవాలా' తరవాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న సినిమా 'శ్యామ్ సింఘ రాయ్'. నాని హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తోంది. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను పక్కన పెట్టినట్టు గుసగుసలు వినిపించాయి. అయితే, సినిమా పనులు జరుగుతున్నాయని దర్శకుడు చెబుతున్నాడు. కథానాయికగా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆమెను సంప్రదించామని తెలిపాడు. సాయి పల్లవి కూడా 'శ్యామ్ సింఘ రాయ్' చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. సినిమాలో కలకత్తా నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. మొదట అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో సెట్స్ వేయాలని డిసైడ్ అయ్యారు.
![]() |
![]() |