![]() |
![]() |

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అండగా మొదలైన ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ 'ఆహా'. తొలి తెలుగు ఓటీటీ కావడంతో దీనికి ఆదరణ చెప్పుకోదగ్గ రీతిలో ఉంది. ఆల్రెడీ క్రిష్ జాగర్లమూడి వంటి స్టార్ దర్శకుడితో వెబ్ సిరీస్ చేసింది. 'పలాస' వంటి రా అండ్ రస్టిక్ సినిమా తీసిన కరుణకుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేసింది. క్రేజీ దర్శకులతో వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేసిన 'ఆహా' మెనేజ్‌మెంట్, స్టార్ హీరోయిన్లతో వెబ్ సిరీస్‌లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నాతో 'ఆహా' మెనేజ్‌మెంట్ ఒక స్పెషల్ షో ప్లాన్ చేశారని టాక్. కరోనా లేకపోతే ఈపాటికి ఈ సిరీస్ గురించి అనౌన్స్మెంట్ వచ్చేది. అది వెబ్ సిరీస్ లేదా వెబ్ షో కావచ్చని టాక్. తమన్నా మాత్రమే కాదు, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌తోనూ ఆహా టీమ్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట. అది ఫిమేల్ సెంట్రిక్ సిరీస్ అట. బోల్డ్ కంటెంట్ తో పాటు మెసేజ్ కూడా ఉంటుందని టాక్. నవీన్ చంద్ర హీరోగా నటించిన 'భానుమతి రామకృష్ణ' త్వరలో ఆహాలో రిలీజ్ కానుంది.
![]() |
![]() |