![]() |
![]() |

కామెడీ పాత్రల్లోను, అవకాశం దొరికినప్పుడల్లా సోలో హీరోగాను రాణిస్తు ముందుకు దూసుకెళ్తున్న నటుడు ప్రియదర్శి(priyadarshi) బలగం ఇచ్చిన సక్సెస్ తో గత నెల జులై 19 న డార్లింగ్ అంటు వచ్చాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది.
ఇస్మార్ట్ పోరి నభానటేష్(nabha natesh) నా డార్లింగ్ అంటు ప్రియదర్శి ఎంత చెప్పినా కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.కథ కథనాలులో ఉన్న లోపాలే వాళ్ల నిర్లక్ష్యానికి ప్రధాన కారణం. దీంతో ఓటిటి లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుంది.స్ట్రీమింగ్ హక్కుల్ని డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుందనే విషయం అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పుడు ఆగస్ట్ 13 నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

రీసెంట్ గా హాట్ స్టార్ అధికారకంగా కూడా ఆ డేట్ ని వెల్లడించింది. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మించగా నూతన దర్శకుడు అశ్విన్ రామ్(aswin raam)తెరకెక్కించాడు. నిహారిక కొణిదెల, అనన్య నాగళ్ళ, బ్రహ్మానందం, మురళీధర్ గౌడ్,రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
![]() |
![]() |