![]() |
![]() |
.webp)
వెబ్ సిరీస్ : బృంద
నటీనటులు: త్రిష, ఆమని, జయప్రకాశ్, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద సామి, రాకేందుమౌళి, సాయి కుమార్ తదితరులు
ఎడిటింగ్: అన్వర్ అలీ
సినిమాటోగ్రఫీ: దినేశ్ కె. బాబు
మ్యూజిక్: శక్తికాంత్ కార్తీక్
రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల
నిర్మాతలు: కొల్ల అవినాష్, ఆశిష్ కొల్ల
ఓటీటీ: సోని లివ్
తెలుగులో అగ్రకథానాయకులతో హీరోయిన్ గా చేసిన త్రిష.. కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక మళ్ళీ కమ్ బ్యాక్ తో అటు తమిళ్, ఇటు తెలుగులో మూవీలు చేస్తుంది. అయితే త్రిష మొదటిసారి చేసిన వెబ్ సిరీస్ 'బృంద'. ఈ సిరీస్ తాజాగా సోనిలివ్ లో రిలీజైంది. ఈ కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ :
ఒక పోలీస్ స్టేషన్ కి కొత్త ఎస్సై గా బృంద(త్రిష) వస్తుంది. ఆ స్టేషన్ లోని మిగతా వారు బృందతో పెద్దగా మాట్లాడరు. అయిన తన పని తాను చేసుకుంటుంది. ఇంతలో ఓ కేసు బృందని చేరుతుంది. ఓ చెరువులో శవం దొరుకుతుంది. అది పోస్ట్ మార్టం చేసాక ఎవరూ ఊహించని విషయాలు బయటకి వస్తాయి. ఆ శవం గుండెలో పదహారు సార్లు కత్తితో పొడిచినట్టు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంటుంది. అయితే బృంద పై అధికారులు ఆ కేసుని త్వరగా క్లోజ్ చేయమని చెప్తారు. కానీ బృంద చేసిన ఇన్వెస్టిగేషన్ లో హత్యకి గురైంది ఒక్కరు కాదని మొత్తం పదహారు మంది అని తెలుస్తుంది. మరి ఆ హత్యలు చేసిందెవరు? బృంద ఒక్కతే కిల్లర్ ని పట్టుకుందా? ఇంతకీ కిల్లర్ ఒక్కడా లేక టీమ్ ఆ తెలియాలంటే సోనిలివ్ లోని ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రతీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో, సిరీస్ లో ఉండే రెగ్యులర్ పాయింట్ ఒక్కటే .. ఎక్కడో ఖ హత్య దానిని ఛేదించే పనిలో పోలీసులు.. ఆ హత్యలు చేస్తుందెవరు అనే క్యూరియాసిటి.. వీటిని ఎవరు ఎంగేజింగ్ చేస్తే ఆ కథ హిట్టు అంతే. ఇలాంటి థ్రిల్ ని ఇస్తూ చివరి వరకు ప్రేక్షకుడిని కూర్చోబెట్టడంలో దర్శకుడు సూర్య మనోజ్ వంగల సక్సెస్ అయ్యాడు.
ఓ హత్యతో ఆసక్తిగా మొదలైన కథ.. బృంద చేసే ఇన్వెస్టిగేషన్ , ఫ్లాష్ బ్యాక్ సీన్లు, మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించాయి. సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రతీది నలభై నిమిషాల పైనే ఉంటుంది. ఈ సిరీస్ కి మైనస్ ఏదైనా ఉందంటే అది నిడివి అంతే.. కానీ సిరీస్ చూస్తుంటే బోరింగ్ అనే ఫీలింగే రాదు. అంతలా మేకర్స్ ఎంగేజింగ్ చేశారు.
ప్రతీ సిరీస్ లో చివరి ఎపిసోడ్ లో ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. కానీ ఈ బృంద(Brinda) లో మూడవ ఎపిసోడ్‌లోనే చేసేస్తారు. అయితే అలా ఎందుకు చేశారనేది నాల్గవ ఎపిసోడ్ నుండి తెలుస్తుంది. ఇక ఒక్కో ఎపిసోడ్ లో ట్విస్ట్, థ్రిల్స్, బృంద ఇన్వెస్టిగేషన్, కిల్లర్ మైండ్ గేమ్ ఇలా ఫుల్ పవర్ ప్యాక్ ఎంగేజింగ్ సీన్లు వస్తుంటాయి. అయితే దర్శకుడు గతాన్ని చెప్పేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడపిస్తుంది. హీరోయిన్ ఒక్కచోట ఓ వల్గర్ వర్డ్ వాడుతుంది. అది వదిలేస్తే మిగతాదంతా బాగుంటుంది. అడల్ట్ సీన్లు లేవు. అయితే మర్డర్స్ చూపించే చోట కాస్త రక్తపాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది విలన్ ఎలవేట్ చేసేందుకు దర్శకుడు అలా డిజైన్ చేశాడని చూశాకే తెలుస్తుంది. ఇక చివరి ఎపిసోడ్ లో కథ తారాస్థాయికి చేరుతుంది. బృంద క్యారెక్టర్ ని డిఫైన్ చేసిన తీరు, కథనం, అన్నీ వర్కవుట్ అయ్యాయి. విలన్ గా ఆనందసామి పాత్ర సిరీస్ చూసిన ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ బాగుంది. దినేశ్ కె. బాబు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
బృందగా త్రిష నటన ఈ సిరీస్ కి ఫ్రదాన బలంగా నిలిచింది. ఆనందసామి నటన బాగుంది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : నిడివి కాస్త ఇబ్బంది పెట్టిన ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ ఇది. వెల్ ఎగ్జిక్యూటెడ్ క్రైమ్ థ్రిల్లర్ విత్ బెస్ట్ థ్రిల్స్.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |