![]() |
![]() |

హీరోగా నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. కథలో ఎంపికలో వైవిధ్యం చూపిస్తాడని పేరు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్ (Allu Sirish). ఇప్పుడు 'బడ్డీ' (Buddy) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో పాటు, టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. నేడు(ఆగస్టు 2) థియేటర్లలో అడుగుపెట్టిన 'బడ్డీ' మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది.
నిజానికి ఇటీవల వైజాగ్ లో వేసిన 'బడ్డీ' ప్రీమియర్ షోకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు పలు చోట్ల మొదటి షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అందులో మెజారిటీ ట్వీట్ లు పాజిటివ్ గానే ఉంటున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'బడ్డీ' బాగుందని, ముఖ్యంగా 'టెడ్డీ' మూవీ చూడనివాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చుతుందని అంటున్నారు. కామెడీ బాగా వర్కౌట్ అయిందని, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అదిరిపోయాయని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |