![]() |
![]() |

కొడుకు తనకంటే ఉన్నతమైన స్థానానికి ఎదిగినప్పుడు, ప్రపంచమంతా ఆ కొడుకును చూసి ప్రశంసిస్తున్నప్పుడు ఆ తండ్రి పొందే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన, భావోద్వేగ క్షణాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కు జాతీయ స్థాయిలో దక్కిన ఒక అరుదైన గౌరవంపై చిరంజీవి ఎంతో ఎమోషనల్ అవుతూ సుమతీ శతకంలోని ఒక ప్రసిద్ధ పద్యాన్ని గుర్తు చేసుకున్నారు.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అంటూ తన మనసులోని అంతులేని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా హల్చల్ చేస్తోంది.
ఇటీవల నిర్వహించిన 'రిపబ్లిక్ టీవీ' ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ఈ సదస్సులో రామ్ చరణ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని పాల్గొన్న ఈ ఈవెంట్ లో రామ్ చరణ్‌ను "న్యూ ఏజ్ మెగాస్టార్" అని సంబోధించడం చిరంజీవి ఆనందానికి కారణమైంది.
"ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను "New Age MegaStar" అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ ఎమోషనల్ ట్వీట్ చూసి మెగా అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.
https://x.com/KChiruTweets/status/2069661985239871964
![]() |
![]() |