![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన అద్భుతమైన నటనతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతతోనూ లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, ఫ్యామిలీతో కలిసి గడిపేందుకు ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఒక ఆహ్లాదకరమైన వెకేషన్ కోసం హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్న మహేష్ బాబును చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నెటిజన్లు ఈ వీడియోలపై హార్ట్ ఎమోజీలను కురిపిస్తూ, ఇది ఆయనకు దక్కిన ఒక మంచి విరామం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిన్న విరామానికి ముందు మహేష్ బాబు తన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'వారణాసి' (Varanasi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో.. పురాతన కళాఖండాల వేటలో సాగే ఒక పరాక్రమవంతుడైన 'రుద్ర' అనే యోధుడి పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
రీసెంట్ గా ఒక ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన మహేష్ బాబు ఈ చిన్న విరామాన్ని తీసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ముగించుకుని తిరిగి జూలై 1 ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'వారణాసి' సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో జాయిన్ అవుతారు.
రాజమౌళి మార్క్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే డేట్‌ను లాక్ చేసింది.
![]() |
![]() |