![]() |
![]() |

బాలనటిగా 50కి పైగా చిత్రాల్లోనూ.. కథానాయికగా 12 సినిమాల్లోనూ నటించిన అనుభవం షాలిని సొంతం. కోలీవుడ్ స్టార్ అజిత్ ని ప్రేమించి పెళ్ళాడిన షాలిని.. వివాహానంతరం మళ్ళీ మరే చిత్రంలోనూ నటించలేదు. కట్ చేస్తే.. దాదాపు 20 ఏళ్ళ తరువాత ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ రి-ఎంట్రీకి సిద్ధమవుతున్నారట. అది కూడా.. లెజండరీ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం.
ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకదిగ్గజం మణిరత్నం ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' పేరుతో ఓ నవలాధారిత చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష.. ఇలా భారీ తారాగణమే నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం షాలినిని సంప్రదించారట మణిరత్నం. పాత్ర నచ్చడంతో పాటు మణిరత్నం అంటే ప్రత్యేక అభిమానం ఉండడంతో వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాలిని. త్వరలోనే 'పొన్నియన్ సెల్వన్'లో షాలిని ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, మణిరత్నం రూపొందించిన ప్రణయ దృశ్యకావ్యం 'అలైపాయుదే' (తెలుగులో 'సఖి')తో షాలిని కథానాయికగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |