Home  »  News  »  'చెన్నై లవ్ స్టోరీ' సంచలనం.. పెయిడ్ ప్రీమియర్స్‌తోనే ఇన్ని కోట్లా.!

Updated : Jul 24, 2026

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాతలు SKN, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ప్రేమకథా చిత్రానికి రవి నంబూరి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తూ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ ప్రేమకథకు ప్రధాన బలంగా నిలిచింది. నేడు(జూలై 24) ఈ సినిమా విడుదల కాగా, నిన్న రాత్రి ప్రీమియర్స్ వేశారు.

సాధారణంగా ఒక ప్రేమకథా చిత్రానికి ప్రీమియర్ షోల ద్వారా భారీ మొత్తంలో వసూళ్లు రావడం అరుదు. అయితే 'చెన్నై లవ్ స్టోరీ' ఆ రికార్డులను తిరగరాసింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ఈ చిత్రం ఏకంగా రూ. 3.13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన లవ్ స్టోరీ సినిమాల్లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది.

'చెన్నై లవ్ స్టోరీ' బుకింగ్స్ బాగున్నాయి. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

సినిమాలోని కథ, కథనాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉండటంతో పాటు, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మణిశర్మ అందించిన మ్యూజికల్ మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులకు మైమరిపించే అనుభూతిని అందిస్తోంది.

 

Chennai Love Story, Box Office, Kiran Abbavaram, Sri Gouri Priya, Sai Rajesh, SKN

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.