![]() |
![]() |

నిజజీవితంలో మేనమామ, మేనల్లుళ్ళు అయిన కింగ్ నాగార్జున, సుమంత్.. వెండితెరపై ప్రాణ స్నేహితులుగా అలరించిన చిత్రం `స్నేహమంటే ఇదేరా!`. టైటిల్ కి తగ్గట్టే స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ సినిమాలో ఫ్రెండ్స్ రోల్స్ లో తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు నాగ్, సుమంత్. తన తొలి చిత్రం `యువకుడు`(2000)లో సుమంత్ కి జోడీగా నటించిన భూమిక.. ఇందులో నాగ్ కి జంటగా దర్శనమివ్వడం విశేషం. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఫ్రెండ్స్` (1999) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యూష, సుధాకర్, అభినయశ్రీ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు, గిరిబాబు, రామిరెడ్డి, శ్రీమాన్, సంగీత, సత్య ప్రియ, రమాప్రభ, తెలంగాణ శకుంతల ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. `ప్రియమైన నీకు` (2001) ఫేమ్ బాలశేఖరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మించారు.
శివశంకర్ సంగీతమందించిన ఈ చిత్రంలో ``చెలియా నీ ప్రేమలోనే``, ``స్నేహమంటే ఇదేరా``, ``కన్నెపిల్లలే``, ``నా పెదవికి సిగ్గులు``, ``రుక్కు రుక్కు``.. వంటి గీతాలు రంజింపజేశాయి. 2001 అక్టోబర్ 26న విడుదలై అక్కినేని అభిమానులను అలరించిన `స్నేహమంటే ఇదేరా!`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |