![]() |
![]() |

ఒక భాషలో సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమాలు.. మరో భాషలోకి రీమేక్ చేస్తుంటారు. అలా దేశీయంగా అయినా అంతర్జాతీయంగా అయినా ఆయా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటి వరకు అలా వచ్చిన చిత్రాలు కోకొల్లలు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో'.. . ఈ చిత్రం టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించింది.
తాజాగా ఈ చిత్రం బెంగాలీలో ‘బాజీ’ పేరుతో తెరకెక్కింది. ప్రముఖ బెంగాలీ నటుడు జీత్, ప్రముఖ నటి మిమి చక్రవర్తి ఈ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన దసరా కానుకగా విడుదల కానుంది. పశ్చిమ బెంగాల్‌లో దసరా శరన్నవరాత్రులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాంటి పండగ సమయంలో విడుదలవుతున్న 'బాజీ' చిత్రం కోసం బెంగాలీ బాబులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు.
![]() |
![]() |