![]() |
![]() |
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటో ఇంకా తెలియరాలేదు. బండ్ల గణేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియో మాత్రం బయటికి వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ‘ఆంజనేయులు’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత ‘గబ్బర్‌సింగ్’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘తీన్‌మార్’, ‘టెంపర్’ వంటి చిత్రాలను నిర్మించి టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చెయ్యాలన్న ఉద్దేశంతో 2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, ఆయనకు టిక్కెట్ లభించలేదు. దీంతో 2019 ఏప్రిల్ 5న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు బండ్ల గణేశ్.
![]() |
![]() |