Home  »  News  »  టాలీవుడ్ హీరోయిన్ తో బాలయ్య విలన్ పెళ్లి..7 ఏళ్లుగా సహ జీవనం, ఇద్దరు పిల్లలు

Updated : Aug 22, 2026

 


ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2  లో మేజర్ ఇక్బాల్ గా నెగిటివ్ రోల్ లో అత్యద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచిన నటుడు అర్జున్ రామ్ పాల్.  పార్ట్ 2 లో అయితే తనదే కీలక రోల్    ఒకప్పటి హీరో కూడా అయిన అర్జున్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరిలో విలన్ గా చేసి మెప్పించిన విషయం తెలిసిందే. 

గత 8 ఏళ్లుగా డేటింగ్ చేస్తూ, సహజీవనం సాగిస్తున్న తన  గర్ల్‌ఫ్రెండ్, సౌత్ ఆఫ్రికన్ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ 'గ్యాబ్రియెల్లా డెమెట్రియాడేస్‌'ని గోవాలోని మపుసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా వివాహం చేసుకున్నాడు. గోవా తీరంలో అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆప్తమిత్రుల సమక్షంలో  వివాహ వేడుక ప్రశాంతమైన వాతావరణంలో, సింపుల్‌గా జరిగింది. సాధారణంగా గోవా చట్టాల ప్రకారం మొదటి సంతకానికి, రెండో సంతకానికి మధ్య 15 రోజుల సుదీర్ఘ నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్) ఉంటుంది. అయితే, వీరు స్థానిక కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ప్రత్యేక అనుమతి పొంది ఈ 15 రోజుల నిరీక్షణ సమయాన్ని మినహాయించుకుని వేగంగా ప్రక్రియని  పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ జంట ఎంతో క్యాజువల్ దుస్తుల్లో రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకుని సంతకాలు చేయగా, సబ్ రిజిస్ట్రార్ సూరజ్ వర్ణేకర్ ఈ వివాహాన్ని నమోదు చేశారు.

అర్జున్ రాంపాల్, గ్యాబ్రియెల్లా లవ్ స్టోరీ 2018 లో ప్రారంభమైంది. మొదటి భార్య, మాజీ సూపర్ మోడల్ మెహర్ జెస్సియాతో విడిపోయిన తర్వాత అర్జున్ జీవితంలోకి గ్యాబ్రియెల్లా అడుగుపెట్టింది. 1998లో మెహర్ జెస్సియాను వివాహం చేసుకున్న అర్జున్‌కు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధం తర్వాత 2018లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించగా, 2019 నవంబరులో వీరికి అధికారికంగా విడాకులు వచ్చాయి. అదే 2018 సమయంలోనే అర్జున్, గ్యాబ్రియెల్లా ప్రేమలో పడ్డారు.సహజీవనంలో ఉన్న ఈ జంటకు 2019 లో మొదటి కుమారుడు అరిక్ (Arik) జన్మించాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు  రెండో కుమారుడు అరవ్ (Arav) జన్మించాడు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన ఈ జంట సమాజంలో ఎలాంటి దాపరికం లేకుండా తమ బంధాన్ని కొనసాగించారు. గతంలో ఓ టాక్ షో లో అర్జున్ మాట్లాడుతూ "పెళ్లి అనేది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే, మేమిద్దరం మనస్ఫూర్తిగా ఎప్పుడో భార్యాభర్తల్లాగే కలిసి జీవిస్తున్నాం" అని పేర్కొనడం విశేషం.


Also Read: షూటింగ్ లో గుండెపోటు.. డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్ 

అయితే 2025 లో ఈ జంట అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు సరిగ్గా 8 సంవత్సరాల సహజీవనం తర్వాత, ఇద్దరు పిల్లలు సాక్షిగా గోవాలో చట్టబద్ధమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా మెరిసిన అర్జున్ రాంపాల్, ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ కింగ్ నాగార్జున,  కార్తీ నుంచి వచ్చిన  ‘ఊపిరి’ సినిమాలో గాబ్రియెల్లా కీ రోల్ లో కనిపించింది. 

Arjun Rampal, Gabriella Demetriades, Balakrishna

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.