![]() |
![]() |

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అప్పట్లో పలు కామెడీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విష్ణు.. కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోలేదు. అలాంటి విష్ణు వంద కోట్ల బడ్జెట్ తో 'కన్నప్ప' చేస్తున్నాడని న్యూస్ వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అనవసరంగా రిస్క్ చేస్తున్నాడని అభిప్రాయపడిన వారున్నారు. అయితే ఈ సినిమాలో నటిస్తున్న భారీ తారాగణం, రెగ్యులర్ గా వస్తున్న బిగ్ అప్డేట్స్ తో రోజురోజుకి 'కన్నప్ప' రేంజ్ పెరుగుతూ, అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు టీజర్ అప్డేట్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగానే భారీ క్యాస్టింగ్‌తో 'కన్నప్ప' చిత్రం రాబోతోంది. అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ క్యాస్టింగ్ ఇందులో కనిపించబోతోంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ వంటి దిగ్గజాలు ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్ వంటి మహామహులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'కన్నప్ప' సినిమా షూటింగ్ అంతా దాదాపు న్యూజిలాండ్లోనే జరిగింది. రెండు భారీ షెడ్యూల్స్‌ను అక్కడ నిర్వహించారు. ఒక్కో షెడ్యూల్ 30 నుంచి 60 రోజులు జరిగింది. ఇక మిగిలిన కొద్ది పాటి షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో అక్షయ్ కుమార్, ప్రభాస్ పోషించే పాత్రలకు సంబంధించిన షూటింగ్‌ను ప్లాన్ చేశారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ తన ప్టార్‌ను కంప్లీట్ చేశారు. ప్రభాస్ మీద కొన్ని సీన్లను చిత్రయూనిట్ తీస్తోంది.

కన్నప్ప మూవీని ప్రపంచ వేదిక మీద అందరికీ పరిచయం చేయబోతోన్నారు. 'వరల్డ్ ఆఫ్ కన్నప్ప' పేరుతో టీజర్‌ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. మే 20న జరుగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బడా హాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ జరుగుతుంటాయి. అలాంటి చోట 'కన్నప్ప' టీజర్ విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ అంచనాలకు తగ్గట్టుగా టీజర్ మెప్పిస్తే.. సినిమా రేంజ్ ఒక్కసారిగా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |