![]() |
![]() |
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘‘ఆరంభం’’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘‘ఆరంభం’’ నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత అభిషేక్ వీటీ మాట్లాడుతూ - మా సినిమాకు ప్రతి షో 60, 70 పర్సెంట్ ఫిల్ అవుతున్నాయి. నిన్న ఈవెనింగ్ థియేటర్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ప్రేక్షకులు ఇంకా మరింత మంది మా మూవీ చూసేందుకు రండి. మీరు ఆదరిస్తేనే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయగలం. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి మాట్లాడుతూ - మా మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. రివ్యూస్ కూడా అప్రిషియేట్ చేస్తూ వచ్చాయి. నా ఫేవరేట్ రివ్యూవర్స్ చాలా మంది మూవీ బాగుందని రాశారు. మంచి ప్లెజెంట్ మూవీ మీరు థియేటర్ లో చూస్తే ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
దర్శకుడు అజయ్ నాగ్ వి మాట్లాడుతూ - ఎక్కువ థియేటర్స్ లో మా సినిమా రిలీజ్ కాలేదు. అదొక్కటే ప్రేక్షకుల నుంచి వస్తున్న కంప్లైంట్. మూవీ చూసిన వాళ్లు మాత్రం బాగుందని చెబుతున్నారు. మేము వేసిన ప్రీమియర్ షోలో స్నేహితులు, బంధువులు సినిమాను మెచ్చుకున్నారు. నిన్న ఒక థియేటర్ కు వెళ్లి చూస్తే క్లైమాక్స్ కు స్టాండిరగ్ ఒవేషన్ వస్తోంది. మేమంతా కొత్త వాళ్లం. మా సినిమాకు ప్రేక్షకులు అలా రెస్పాన్స్ ఇవ్వడం హ్యాపీగా అనిపించింది. మౌత్ టాక్ తో పాటు కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మరో ఒక ట్రెండు రోజుల్లో షోస్ ఫుల్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు.
![]() |
![]() |