![]() |
![]() |

కొద్దిరోజుల క్రితం రాజ్ తరుణ్, లావణ్య వివాదం సంచలనమైన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్యనే తనను ఇబ్బంది పెడుతుందని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని రాజ్ తరుణ్ అన్నాడు. వీరి గొడవ చాలారోజుల పాటు సాగింది. మీడియా, సోషల్ మీడియాలో ఈ టాపిక్ మారుమోగిపోయింది. అయితే కొద్దిరోజులుగా వీరి వివాదం గురించి పెద్దగా వార్తలు లేవు. అలాంటిది ఇప్పుడు సడెన్ గా మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది.
రాజ్ తరుణ్ తన అనుచరులతో కలిసి ఇబ్బంది పెడుతున్నాడని తాజాగా లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ తో కలిసి కొన్నేళ్ల క్రితం కోకాపేట్ లో విల్లాను కొనుగోలు చేశానని, 2024 లో రాజ్ తరుణ్ ఆ విల్లాను ఖాళీ చేశాడని తెలిపింది. ప్రస్తుతం తన సోదరుడితో కలిసి అక్కడ ఉంటున్నాని, అయితే తాము లేని సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు వచ్చి ఇంటిని ఖాళీ చేసి, పెంపుడు జంతువులని చేశారని చెప్పింది.
"కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంట్లో సమయంలో వచ్చి.. ఇంట్లోని వస్తువులన్నీ తీసుకెళ్లారు. లీగల్ గా చూసుకుంటానన్న రాజ్ తరుణ్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్?. పెంపుడు కుక్కలను కూడా చంపేశారు. కూతురు కూతురు అన్నాడు.. హ్యాపీ తల్లి(కుక్క పిల్ల)ని చంపేశాడు. ఇలాంటి వాళ్ళని చట్టం వదలకూడదు. వాళ్ళకి శిక్ష పడే వరకు నా పోరాటం ఆగదు. రాజ్ తరుణ్ నువ్వు తప్పించుకోలేవు." అని లావణ్య చెప్పుకొచ్చింది. తాజా ఘటనతో లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
![]() |
![]() |