![]() |
![]() |

ఇటీవల 'మహావతార్ నరసింహ' చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడదే బాటలో మలయాళ చిత్రం 'లోకా' పయనించేలా ఉంది. (Lokah Chapter 1 Chandra)
కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్ర పోషించిన 'లోకా' చిత్రాన్ని వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఈ సూపర్ హీరో ఫిల్మ్ కి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 28న థియేటర్లలో అడుగుపెట్టిన 'లోకా' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. (Lokah collections)
మలయాళ ఇండస్ట్రీలో వేగంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా 'లోకా' నిలిచింది. 'లూసిఫర్ 2: ఎంపురాన్' రెండు రోజుల్లో, 'తుడరుమ్' ఆరు రోజుల్లో ఈ ఫీట్ సాధించాయి. ఆ రెండిట్లో మోహన్ లాలే హీరో కావడం విశేషం. ఇప్పుడు మోహన్ లాల్ సినిమా 'తుడరుమ్' సరసన 'లోకా' నిలిచింది.
'లోకా' మూవీ ఫుల్ రన్ లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముంది. అదే జరిగితే.. మలయాళ సినీ చరిత్రలో 200 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో సినిమాగా నిలవనుంది.

కేవలం మలయాళంలోనే కాకుండా.. ఇండియన్ సినిమా పరంగా కూడా 'లోకా' చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఓ సూపర్ ఉమెన్ ఫిల్మ్ వంద కోట్ల క్లబ్ లో చేరడం ఇదే మొదటిసారి. అలాగే సౌత్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గానూ నిలిచింది.
ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ వంద కోట్ల క్లబ్ లో చేరడం, అందునా మొదటి వారంలోనే చేరడం అనేది మామూలు విషయం కాదు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న అనుష్క శెట్టినే ఇంకా ఈ ఫీట్ సాధించలేదు. అలాంటిది కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' సినిమాతో ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం.
'లోకా' మూవీ తెలుగునాట 'కొత్త లోక' పేరుతో ఒకరోజు ఆలస్యంగా విడుదలై.. ఇక్కడ కూడా మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. బుధవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ విడుదల చేశారు.
![]() |
![]() |