![]() |
![]() |

గత వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేమలు. మలయాళ మాతృక అయిన ఈ మూవీ మంచి మౌత్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు సైతం మూవీ చూడటానికి క్యూ కడుతున్నారు.ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ దర్శకుడు కూడా చేరాడు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటీవలే ఆయన ప్రేమలు మూవీ ని వీక్షించాడు. అంతటితో ఆగకుండా ప్రేమలు టీం పై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. మూవీ చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు చాలా సరదాగా ఉంది. అన్ని క్యారక్టర్ లు చాలా చక్కగా చేసాయి. రైటింగ్ లో సింప్లిసిటీ తో పాటుగా, ఎక్జిక్యూషన్ బాగా నచ్చింది అని చెప్పాడు. తెలుగు డబ్బింగ్ విడుదల చేసినందుకు కార్తికేయ కి థాంక్స్ కూడా చెప్పాడు .సోషల్ మీడియాలో ఈ విషయాలన్నీ వైరల్ అవుతున్నాయి.
అనిల్ రావిపూడి కూడా కామెడీ ని తెరకెక్కించడంలో దిట్ట.ఆయన ప్రతి సినిమాలోనూ కామెడీ సూపర్ గా ఉంటుంది. ఇక ప్రేమలు లో నస్లెన్ కే. గఫూర్, మమితా బైజు, శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ సంగీతాన్ని అందించాడు. గిరీష్ A.D దర్శకుడు. పార్టీ లేదా పుష్ప ఫాహాద్ నిర్మాతగా వ్యవహరించాడు.
![]() |
![]() |