![]() |
![]() |

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన 'ఓపెన్‌హైమర్'(Oppenheimer) సత్తా చాటింది. తాజాగా ప్రకటించిన ఆస్కార్స్-2024 (Oscars 2024) లో ఏకంగా ఏడు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులు ఉండటం విశేషం.
2020లో వచ్చిన 'టెనెట్' తర్వాత క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఓపెన్‌హైమర్'. 2023 జులైలో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఇది క్రిస్టోఫర్ డైరెక్ట్ చేసిన మొదటి బయోపిక్ కావడం విశేషం. అమెరికా శాస్త్రవేత్త, అణుబాంబు పితామహుడు 'జూలియస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్స్ లో సత్తా చాటింది.
ఆస్కార్స్-2024 లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు(క్రిస్టోఫర్ నోలన్), ఉత్తమ నటుడు(కిలియన్ మర్ఫీ), ఉత్తమ సహాయ నటుడు(రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్(హొయితే వాన్ హోతేమ), ఉత్తమ ఎడిటర్(జెన్నిఫర్ లేమ్), ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్(లుడ్విగ్ గోరాన్సన్) విభాగాల్లో 'ఓపెన్‌హైమర్' సినిమా అవార్డులను గెలుచుకుంది.
కాగా, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ కి ఇదే మొదటి ఆస్కార్ అవార్డు.
![]() |
![]() |