![]() |
![]() |

ఒకప్పుడు సీరియల్స్ అంటే కుటుంబ సమేతంగా చూసేలా ఉండేవి. కానీ ఇప్పుడు సీరియల్స్.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, మానభంగాలు, అక్రమ సంబంధాలతో నిండిపోతున్నాయి. కొందరు నటీనటులైతే.. వాటిని సీరియళ్ల వరకే పరిమితం చేయడంలేదు. నిజ జీవితంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ సీరియల్ నటి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
విశాఖకు చెందిన సీరియల్ నటి ఐశ్వర్య తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందంటూ.. ఆమె భర్త శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నటి ఐశ్వర్యను శ్యామ్ కుమార్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదట్లో బాగానే ఐశ్వర్య.. తర్వాత తనలోని మహానటిని బయటకు తీసిందట. పెళ్ళైన తర్వాత ఏకంగా రూ.25 లక్షలు కాజేసి, విడాకులు ఇవ్వాలని టార్చర్ చేస్తుందట. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. బెదిరింపులకు పాల్పడుతుందట. విడాకుల కోసం తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా వేధిస్తోందని మీడియా సాక్షిగా తన బాధను పంచుకున్న శ్యామ్ కుమార్.. తనను న్యాయం చేయాలని కోరుతున్నాడు.
అయితే ఐశ్వర్య తనను మోసం చేసిందంటూ శ్యామ్ కుమార్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. నటి ఐశ్వర్య వెర్షన్ కూడా వింటే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశముంది. అలాగే పోలీసులు ఈ కేసులోని వాస్తవాలను వెలికితీయాల్సి ఉంది.
![]() |
![]() |