![]() |
![]() |

ప్రముఖ యాంకర్, వైసీపీ నేత శ్యామల(Shyamala)కు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మందిపై ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో శ్యామల కూడా ఉంది. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ ఇప్పటికే శ్యామల కోర్టుని ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసులోకి ఈడీ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారట. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు? ఎంతెంత డబ్బు, ఎవరెవరి చేతులు మారింది? అనే వివరాలు లాగుతున్నారట. అలాగే, ఈ విషయంలో శ్యామల భర్త పాత్రతో పాటు, శ్యామల ఆస్తుల గురించి, లావాదేవీల గురించి కూడా ఆరా తీస్తున్నారట. అధికారుల దూకుడు చూస్తుంటే.. ఏ క్షణమైనా శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశముందని వార్తలొస్తున్నాయి.
![]() |
![]() |