![]() |
![]() |

మెగా డాటర్ నిహారిక కొణిదల యాంకర్ గా, యాక్టర్ గా అలరించడమే కాకుండా.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి, పలు సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లను అందించిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో మొదటి ఫీచర్ ఫిల్మ్ గా 'కమిటీ కుర్రోళ్ళు' రూపొందింది. ఎందరో యువ ప్రతిభావంతులను పరిచయం చేస్తూ నిహారిక నిర్మించిన ఈ కామెడీ డ్రామా మూవీ.. గతేడాది ఆగస్టులో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు నిర్మాతగా రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు నిహారిక. (Niharika Konidela)
'కమిటీ కుర్రోళ్ళు' సక్సెస్ తరువాత నిహారిక తన రెండవ సినిమానిని ఫిమేల్ డైరెక్టర్ మానస శర్మతో చేయబోతున్నారు. మానస శర్మ గతంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందిన 'ఒక చిన్న ఫ్యామిలి స్టోరీ'కి క్రియేటివ్ డైరెక్టర్ గా, 'బెంచ్ లైఫ్' వెబ్ సిరీస్ కి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో మూడవ ప్రాజెక్ట్ గా.. ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు మానస. మరి ఈ చిత్రంతో నిహారిక, మానస మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

![]() |
![]() |